అనంతపురంలోని యు రంగాపురం గ్రామ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా... ఐచర్ వాహనంలో కిరాణ సరకుల మధ్యలో గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన దివాకర్, శశికుమార్ అనే వ్యక్తులు బెంగళూరు నుంచి పావగడకు... రూ.45,000 విలువ చేసే 9360 గుట్కా పాకెట్లను ఐచర్ వాహనంలో తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు.
కిరాణ సరకుల మధ్య రూ.45,000 విలువ చేసే గుట్కా - పోలీసులు తనిఖీల్లో గుట్కా స్వాధీనం
కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు... అక్రమంగా ఐచర్ వాహనంలో గుట్కా ప్యాకెట్లు తీసుకెళ్తుండగా... అనంతపురం,మడకశిర మండలం సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం