'కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలి... భౌతిక దూరం పాటించాలి...' ఇలా ప్రతి రోజు ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికా ప్రకటనలలో ప్రచారం చేస్తున్నా... అనంతపురం జిల్లా గుంతకల్లులోని ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కూరగాయల మార్కెట్లో కనీసం భౌతికదూరం పాటించడం లేదు.
గుంతకల్లు కూరగాయల మార్కెట్లో కనిపించని భౌతికదూరం - anathapuram news
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నా... అనంతపురం జిల్లా గుంతకల్లు వాసుల్లో మాత్రం ఏ మార్పు కన్పించడం లేదు. కూరగాయల మార్కెట్లో ఏ ఒక్కరు కూడా కనీసం భౌతికదూరం పాటించడం లేదు.
![గుంతకల్లు కూరగాయల మార్కెట్లో కనిపించని భౌతికదూరం gunthkul people not follow the physical distance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7802287-335-7802287-1593323219333.jpg)
కూరగాయల మార్కెట్లో కనిపించని భౌతిక దూరం
ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు మార్కెట్కు తరలివస్తున్నారు. పోలీసులు ఎంత అదుపు చేసినా.. వారి ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. దుకాణాల ముందు యజమానులు కేవలం వలయాలు మాత్రమే ఏర్పాటు చేయగలిగారే తప్ప... సబ్బులు, శానిటైజర్లను అందుబాటులో ఉంచడం లేదు. ఫలితంగా కరోనా వ్యాప్తి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.