కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాలోని పీచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓవ్యక్తి హత్య కేసులో నిండితుడిని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
హత్య ఎలా జరిగిందంటే...
కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాలోని పీచి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓవ్యక్తి హత్య కేసులో నిండితుడిని అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
హత్య ఎలా జరిగిందంటే...
ఒడిశా రాష్ట్రానికి చెందిన సన్యాసినాయక్, అశోక్ కుమార్ కేరళలో భవన నిర్మాణ పనులు చేస్తుండేవారు. పనిలో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో 11వ తేదీన సన్యాసి నాయక్ దారుణ హత్యకు గురయ్యాడు. అశోక్ హత్య చేసినట్లు కేరళ పోలీసులు భావించారు. మొదట్లో దీనిని అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులకు మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో...పోలీసులు కేసు విచారణను సవాలుగా తీసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే నిందితుడు అశోక్ కుమార్ అక్కడినుండి పరారీ అయ్యాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ఫోటోలు ఆనవాళ్ళతో సహా కేరళ పోలీసులు అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లకు సమాచారం అందించారు.
ఇలా దొరికాడు...
ఈ సమాచారం అందుకున్న గుంతకల్లు రైల్వే రక్షక దళం, జీఆర్పీ పోలీసులు కేరళ నుంచి గుంతకల్లు స్టేషన్కు వచ్చే అన్ని రైళ్లలో తనిఖీలు నిర్వహించారు. 13వ తేదీ ఉదయం హత్య కేసులో నిందితుడైన అశోక్ కుమార్ను కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలులో గుర్తించి చాకచక్యంగా పట్టుకున్నారు. జీపీఎస్ సాంకేతకతను ఉపయోగించి, హత్య జరిగిన 2 రోజుల్లోనే నిందితుడిని పట్టుకొని కేరళ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:కడప జిల్లాలో మహిళ దారుణ హత్య