అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివారులో ఉన్న పవన్ ఫార్మర్స్ వేర్‌హౌస్‌లో ధాన్యం నిల్వ ఉంచి... కష్టాల పాలైన అన్నదాతల కథ సుఖాంతం అయ్యింది. గోదాము యాజమాన్యం ఎన్సీఎమ్ఎల్ సంస్థ ద్వారా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలు చెల్లించలేదు. అంతేకాకుండా గోదాము యాజమాన్యం కనిపంచకుండా పోయింది. దీంతో ఎన్సీఎమ్ఎల్ సంస్థ ముందుజాగ్రత్తగా... పవన్ ఫార్మర్స్వేర్ హౌస్‌కి గత కొంతకాలంగా తాళాలు వేసి ఉంచింది. దీంతో గోదాములో పండిన పంటను నిల్వ ఉంచిన రైతులు ఆందోళనకు గురయ్యారు. గోదాములో ఉన్న తమ పంటను ఇచ్చేయాలంటూ.. రైతులు పది రోజులుగా గోదాము చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కడుపు మండిన అన్నదాతలు 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
రైతుల చర్యతో పోలీసు అధికారులు దిగివచ్చారు. పోలీసులు ఎన్సీఎమ్ఎల్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదు.