రైల్వే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. అనంతపురం జిల్లా గుంతకల్లు డివిజన్ లో రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాత్రిపూట విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీలింగ్ ఎత్తివేయాలని, నూతన పింఛన్ విధానం రద్దు చేయాలని నినాదాలు చేశారు. రన్నింగ్ సిబ్బందికి కిలోమీటర్లు తగ్గించడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.
గుంతకల్లులో రైల్వే మజ్దూర్ యూనియన్ కొవ్వొత్తుల ర్యాలీ - గంతకల్లు రైల్వే మజ్డూర్ యూనియన్ కొవ్వొత్తుల ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని అనంతపురం జిల్లా గంతకల్లులో రైల్వే మజ్దూర్ యూనియన్ సభ్యులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ.. స్టేషన్ ప్రాంగణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గుంతకల్లు రైల్వే స్టేషన్లో కొవ్వొత్తుల ర్యాలీ