అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్ను గుంతకల్లు ఏడీఆర్ఎం సైమన్ తనిఖీ చేశారు. స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ కేంద్రం, ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం డివిజన్ పరిధిలో రైళ్లలో చేపడుతున్న భద్రత చర్యల గురించి ఆరా తీశారు. స్టేషన్ అవరణలోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. నిఘా నేత్రాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఆయనతో పాటు అసిస్టెంట్ కమాండర్ అంజు కుమార్, అధికారులు పాల్గొన్నారు.
ధర్మవరం రైల్వేస్టేషన్లో గుంతకల్లు ఏడీఆర్ఎం తనిఖీలు - ధర్మవరం రైల్వే స్టేషన్ తాజా వార్తలు
ధర్మవరం రైల్వే స్టేషన్లో గుంతకల్లు ఏడీఆర్ఎం సైమన్ అకస్మిక తనిఖీ చేపట్టారు. డివిజన్ పరిధిలో తిరిగే రైళ్లలో చేపడుతున్న భద్రతా చర్యల గురించి ఆరా తీశారు. స్టేషన్లో ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ కేంద్రంను పరిశీలించారు.

ధర్మవరం రైల్వే స్టేషన్లో తనిఖీలు