లాక్డౌన్తో దేశంలోని అన్ని వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయిది. కానీ... దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లోని గుంతకల్లు డివిజన్ మాత్రం ఆదాయం ఆర్జించడంలో ముందు వరసలో నిలిచింది. దేశం మొత్తంగా 3597 ప్రాంతాలకు రవాణా చేసి 1.56 కోట్లరూపాయలు ఆర్జించినట్లు దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ ఆలోక్ తివారి తెలిపారు.
లాక్డౌన్ సమయంలోనూ ప్రజలకు నిత్యావసర సరుకుల రవాణాలో గుంతకల్లు డివిజన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు 66 రాక్స్ బియ్యం, 1 రాక్ గోధుమలు, 6 రాక్స్ ఎరువులు, 2 రాక్స్ సిమెంట్, ఇనుము, సున్నపురాయితో పాటు ఎర్ర మట్టి రవాణా చేసింది. రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు... కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి జిల్లాల ప్రజలకు నిత్యావసర సరకులను గమ్యాలకు చేర్చింది.