భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు అందిస్తున్న అతిథి ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మహాత్మ జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల సంఘం డిమాండ్ చేసింది. అనంతపురంలోని సంగమేశ్వర సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.
అతిథి ఉపాధ్యాయులుగా చేస్తున్న వారిని సీఆర్టీలుగా గుర్తించాలని కోరారు. ఏప్రిల్ నెల నుంచి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో చేసిన పాదయాత్రలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించి, జీవో నెంబర్ 23 రద్దు చేయాలని కోరారు. వారి డిమాండ్లను నెరవేర్చకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.