వేరుశనగ విత్తనాలు దొరక్క రైతులు అల్లాడుతుంటే కొందరు అక్రమార్కులు వాటిని పక్కదారి పట్టిస్తున్నారు. రైతులకు మాయమాటలు చెప్పి వారి దగ్గరి నుంచి కొనుగోలు చేసిన విత్తనాన్ని బహిరంగమార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అధికారులు పక్కా సమాచారంతో పలు చోట్ల దాడులు చేసి సబ్సిడీ విత్తనాన్ని పట్టుకున్నారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం బిల్లూరువాండ్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 34బ్యాగుల వేరుశనగను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటకకు తరలిస్తున్న మరో 9బ్యాగులను వ్యవసాయశాఖ ఏడి, జేడీలు ఈతోడు వద్ద పట్టుకున్నారు. వీరికి ఈ విత్తనం ఎవరు విక్రయించారు.. ఎక్కడికి తరలిస్తున్నారన్నదానిపై విచారణ చేపట్టారు. విత్తనం దొరకని ఇలాంటి పరిస్థితుల్లో రైతులెవరూ సబ్సిడీ విత్తనాన్ని విక్రయించుకోవద్దని అధికారులు సూచించారు. అవసరమైన వారు మాత్రమే విత్తనం తీసుకోవాలన్నారు. సబ్సిడీ విత్తనం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
అక్రమంగా నిల్వఉంచిన వేరుశనగ విత్తనాల పట్టివేత
అనంతపురం జిల్లా బిల్లూరువాండ్లపల్లిలో అక్రమంగా నిల్వఉంచిన 34 సంచుల వేరుశనగ విత్తనాలను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు.
వేరుశనగ