ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం' - రాయదుర్గంలో రాయితీ విత్తనాలు పంపిణీ వార్తలు

త్వరలో గ్రామ సచివాలయాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని పలు గ్రామాల్లో రైతులకు రాయితీ వేరశనగ విత్తనాలు పంపిణీ చేశారు.

ground nut seeds distributed in raayadurgam by kapu ramachandra reddy
కాపు రామచంద్రారెడ్డి

By

Published : May 26, 2020, 2:52 PM IST

రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాయదుర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని భూప సముద్రం, ఆవులదట్ల గ్రామాల్లో రాయితీ వేరుశనగ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

రైతుల కోసం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రామచంద్రారెడ్డి చెప్పారు. త్వరలోనే ప్రతి గ్రామ సచివాలయంలో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్నదాతలకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడమే కాక.. పంటనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details