అనంతపురం జిల్లా ధర్మవరం మండల పరిధిలోని 35 వేల ఎకరాల్లో రైతులు వేరుశనగ పంటసాగు చేశారు. ఎకరాకు రూ 30,000 చొప్పున పెట్టుబడి పెట్టారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురవడం వల్ల వేరుశనగపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. పూత దశలో వర్షాలు అధికంగా పడటం.. ఎండలు లేకపోవడంతో పోతా సరిగ్గా రాక వేరుశనగ దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది.
అందుకు ఎకరాకు రూ. 6000 ఖర్చు..
పంటను తొలగించి ఇంటికి చేర్చాలంటే ఎకరాకు రూ.6,000 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు వేరుశనగను పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఉప్పునేసిన పల్లి గ్రామానికి చెందిన రైతు భీమనేని రాము సాగుచేసిన ఆరు ఎకరాల వేరుశనగ పంట రోటవేటర్తో తొలగించాడు. మొత్తంగా రూ.రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు.
పూత లేదు.. కాయ లేదు.. వేరుశనగ పంట తొలగించిన రైతు ఇవీ చూడండి : నాడు-నేడు పనుల పురోగతి, స్థితిగతులపై జేసీ సమీక్ష