ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పుట్టపర్తిలో ఘనంగా ఓనం వేడుకలు - onam celebrations at anathapuram latest

అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో ఓనం పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ప్రముఖ శాస్త్రీయ సంగీత గాయకులు కావ్య, అజిత్ బృందం, సత్యసాయి పూర్వ విద్యార్థి, గాయకుడు టీవీ హరిహరన్ నిర్వహించిన సంగీత విభావరి భక్తులను పరవశింపజేసింది.

ఓనం పర్వదిన వేడుకలు నిర్వహిస్తున్న కేరళీయులు

By

Published : Sep 12, 2019, 12:27 PM IST

ఓనం పర్వదిన వేడుకలు నిర్వహిస్తున్న కేరళీయులు

అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో కేరళీయలు నిర్వహించిన ఓనం పర్వదిన వేడుకలు వారి సాంప్రదాయలు ప్రతిబింబేంచేలా సాగాయి. ఇందులో భాగంగా సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహా సమాధిని కేరళ సాంప్రదాయ పద్ధతిలో ముస్తాబు చేశారు. కేరళీయులు అమితంగా ఆరాధించే వామనమూర్తి, సత్యసాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తులను పరవశింపజేసింది. ఓనం సందర్భంగా కేరళీయులు వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details