బ్లాక్‌ఫంగస్‌తో చికిత్స పొందుతూ తొలుత మనవడు, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అవ్వ మృతి చెందటంతో స్థానికంగా విషాదం నెలకొంది. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని శ్రీరంగాపురం క్యాంపునకు చెందిన కె.రవి కుమార్ (35) ఆదివారం కరోనా, బ్లాక్ ఫంగస్‌తో బెంగళూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కగానొక్క మనుమడు దూరమయ్యాడని ఆవేదన చెందిన అతడి అవ్వ గంగమ్మ (75) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది.
రవికుమార్ బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. మొదటగా కరోనా లక్షణాలు రావటం, మళ్లీ బ్లాక్‌ఫంగస్ కళ్లు, ముక్కుకు సోకడంతో పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వైద్యబృందం తెలిపారు. అతడి స్వగ్రామమైన శ్రీరంగాపురం క్యాంపులోని సొంత పొలంలో అంత్యక్రియలు చేశారు. రెండు గంటల వ్యవధిలోనే అవ్వ కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.