అనంతపురం జిల్లా సింగనమల మండలం చిన్న మట్లగొందిలో దారుణం చోటుచేసుకుంది. మైనర్పై సంపత్ అనే గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఉపాధి హామీ పనికి వెళ్లగా.... ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసేందుకు సంపత్ యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడం వల్ల అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు... పోలీసులు వాలంటీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
మైనర్పై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నం - latest news on rape attempts on minor in ananthapuram
మైనర్పై గ్రామ వాలంటీర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా చిన్నమట్లగొందిలో జరిగింది.
మైనర్పై అత్యాచార యత్నానికి పాల్పడిన గ్రామవాలంటీర్