ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జీవో ఎంఎస్ 2ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' - జీవో ఎంఎస్ 2ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రొద్దం MPDO కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన

అనంతపురం జిల్లా రొద్దం ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. జీవో ఎంఎస్ 2ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

జీవో ఎంఎస్ 2ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రొద్దం MPDO కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన
జీవో ఎంఎస్ 2ను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రొద్దం MPDO కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిరసన

By

Published : Mar 26, 2021, 5:25 PM IST

అనంతపురం జిల్లా రొద్దం ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేశారు. గ్రామసచివాలయ పరిపాలన బాధ్యతలను గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవటంపై నిరసన వ్యక్తం చేశారు. వెంటేనే జీవో ఎంఎస్2ను నిలుపుదల చేయాలని ప్లకార్డులతో డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పునః సమీక్షించాలని కోరారు. పంచాయతీ రాజ్ శాఖ ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, పర్యవేక్షణ బాధ్యతను, సిబ్బందికి జీతభత్యాల చెల్లింపులను గ్రామ రెవెన్యూ అధికారులకు అప్పగించడం 73వ రాజ్యాంగ సవరణ, పంచాయతీ రాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థకు కారణమైన జీవో ఎంఎస్ 110, 149కు వ్యతిరేకంగా ఉన్న జీవో ఎంఎస్ 2 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details