ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థుల కోసం.. ఉపాధ్యాయురాలి వినూత్న ప్రయత్నం

నాణ్యమైన విద్యతోపాటు నైతిక విలువలను కూడా నేర్పిస్తున్నారు.. అనంతపురం జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. విద్యార్థుల్లో నిజాయితీని పెంచేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. సొంత ఖర్చులతో నిజాయితీ పెట్టెను నిర్వహిస్తున్నారు.

honesty_box

By

Published : Nov 11, 2019, 7:45 PM IST

విద్యార్థలకోసం.. వినూత్న ప్రయత్నం

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం యర్రగుంటపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి... విద్యార్థులను సన్మార్గంలో నడిపేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. పాఠశాల.. పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెన్సిళ్లు, పెన్నులు, పుస్తకాలులాంటి చిన్న చిన్నవి కొనాలన్నా నగరానికి వెళ్లాల్సిందే. పాఠశాలలో తమ వస్తువులు పోతున్నాయంటూ ప్రధానోపాధ్యాయురాలికి తరచూ ఫిర్యాదులు అందుతుండేవి.

నిజాయితీ పెట్టె ఏర్పాటు

తెలిసీ తెలియని వయసులో చేసే చిన్న చిన్న దొంగతనాలను నివారించాలని విజయలక్ష్మి సంకల్పించారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందుబాటులోకి తీసుకురావడం సహా ఇతరుల వస్తువులు చోరీ చేయాలనే భావనను పూర్తిగా పోగొట్టేందుకు 'నిజాయితీ పెట్టె'ను ఏర్పాటుచేశారు.

విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంచేందుకే

ఈ నిజాయితీ పెట్టెలో విద్యార్థులకు అవసరమైన పాఠశాల సామాగ్రిని ఉంచుతున్నారు. విద్యార్థులు తమకు ఏ వస్తువు అవసరమో.... ఆ వస్తువును ఎవరి అనుమతి లేకుండా తీసుకుని.... అందుకు సరిపడా నగదును అందులో వేయవచ్చు. ఆ సమయంలో తమ వద్ద నగదు లేకపోతే.... తర్వాతెప్పుడైనా ఆ పెట్టెలో డబ్బులు వేయవచ్చు. ఇలా రెండేళ్లుగా పాఠశాలలో నిజాయితీ పెట్టెను సమర్థంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో సత్ప్రవర్తన పెంపొందించేందుకు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నిస్తోందని ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

సెల్‌ఫోన్‌లో మాట్లాడాలంటే.. సాహసం చేయాల్సిందే

ABOUT THE AUTHOR

...view details