అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. పునరావాస పరిహార ప్యాకేజి కింద రూ. 240.53 కోట్లు చెల్లించేందుకు పాలనానుమతి ఇచ్చింది. సీబీఆర్ ప్రాజక్ట్లో మొత్తం 10 టీఎంసీలు నిల్వ సామర్థ్యం పెంపు కోసం పరిహారం చెల్లించనున్నారు.
చిత్రావతి నిర్వాసితుల పునరావాసానికి రూ.240 కోట్లు - అనంతపురం చిత్రావతి రిజర్వాయర్ తాజా వార్తలు
అనంతపురం జిల్లాలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.240.53 కోట్లు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం పాలనానుమతులు ఇచ్చింది. చిత్రావతి రిజర్వాయర్లో 10 టీఎంసీలు నీటిని నింపేందుకు వీలుగా అవసరమైన పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ పరిహారాన్ని మంజూరు చేశారు.
చిత్రావతిచిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాజర్
2013 భూసేకరణ చట్టం ప్రకారం ముంపు గ్రామాల్లో భూ సేకరణతో పాటు నిర్వాసితులకు ఈ మొత్తాన్ని జలవనరుల శాఖ చెల్లించనుంది. తాడిమర్రి, ముగుదిబ్బ మండలాల్లోని నిర్వాసిత గ్రామాలలోని 1729 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు వీలుగా ఈ మొత్తాన్ని మంజూరు చేశారు.
ఇదీ చదవండి :పోతిరెడ్డిపాడు విస్తరణ ఆపేలా ఆదేశాలివ్వండి : తెలంగాణ సీఎం కేసీఆర్