'కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని ఆందోళన' - CPM leaders protest that corona has failed
అనంతపురంలో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరోనా కట్టడికి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు నినాదాలు చేశారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం నాయకులు అనంతపురంలో కలెక్టరేట్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా విజృంభిస్తుంటే ప్రజలకు వైద్య సదుపాయలు అందించటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటానే కరోనా పరీక్ష కేంద్రాలను, వైద్య సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి క్వారెంటైన్, సరైన సౌకర్యాలు కల్పించి పోషకాహారం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.