ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్​ వైద్య రంగానికి పెద్ద పీఠ వేశారు : కాపు

దేశంలోనే వైద్యరంగానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గంలో 104,108 వాహనాలు ప్రారంభించిన ఆయన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

government-whip-kapu-ramachandra-reddy
Dxyరాయదుర్గంలో 104,108 వాహనాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్

By

Published : Jul 4, 2020, 12:22 PM IST

ప్రజల వైద్య సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో 104, 108 వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన ఆయన శాంతినగర్​లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబులెన్స్​లకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అక్కడ నుంచి నేసేపేట, వినాయక సర్కిల్, పాత బస్టాండ్, లక్ష్మీ బజార్ మీదుగా ఆర్ అండ్ బి అతిథి గృహం వరకు అంబులెన్స్​లతోపాటు వైకాపా నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బాటలో తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నట్లు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కొనియాడారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details