కరోనా కారణంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో... అనంతపురం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ, బ్రహ్మణి సొసైటీ నేతృత్వంలో పాత్రికేయులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ చేశారు. లాక్డౌన్ వల్ల నిత్యావసరాలు అందక ప్రజలు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, బెల్లం తదితర నిత్యావసరాల పంపిణీ చేశారు. పాత్రికేయులు ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ - జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ, బ్రహ్మణి సొసైటీ నేతృత్వంలో పాత్రికేయులకు ఉచితంగా నిత్యావసరాల పంపిణీ చేశారు.
జర్నలిస్టులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్