అనంతపురం జిల్లాలోని బెలుగుప్ప, ఉరవకొండ మండలాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. ఎంపీ తలారి రంగయ్య, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో కలిసి మంత్రి శంకర్ నారాయణ జీడిపల్లి జలాశయాన్ని సందర్శించారు. రిజర్వాయర్ కారణంగా వస్తున్న ఊట నీరును నేతలు పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద గ్రామ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా హంద్రీనీవా కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
"ప్రతి ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది" - బెలుగుప్ప, ఉరవకొండ
అనంతపురం జిల్లాలోని రెండు మండలాల్లో మంత్రి శంకర్ నారాయణ పర్యటించారు. హంద్రీనీవా కాలువ ద్వారా ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
మంత్రి శంకర్ నారాయణ