రైతుల కోసం ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ విత్తనాలను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న టెంపో వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేకలపల్లిలో కొంత మంది రైతుల నుంచి రొప్పాల గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యాపారి సబ్సిడీ వేరుశనగ బస్తాలను కొనుగోలు చేశాడు. వాటిని కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని వాహనాన్ని సీజ్ చేశారు.
రాయితీ విత్తనాల అక్రమ రవాణా... ఐదుగురు అరెస్టు - seeds smuggling to karnataka news
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మేకలపల్లి వద్ద ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను అక్రమంగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారన్న సమాచారంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకొని వాహనాన్ని సీజ్ చేసి సోమందేపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.

రాయితీ విత్తనాలు అక్రమ రవాణా