ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు

ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో కబ్జారాయుళ్లకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది.

By

Published : Jul 21, 2019, 1:43 AM IST

kadiri

కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు

అనంతపురం జిల్లా కదిరిలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను స్థిరాస్తి వ్యాపారులు హస్తగతం చేసుకున్నారు. కొండలను తవ్వేస్తూ.. వాగులను పూడ్చేస్తూ.. పట్టణానికి 4 వైపులా వెంచర్లు వేసేశారు. కొంత భూమిని కొంటూ.. పక్కనే ఉన్న భూమిని కలిపేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నవడం.. తర్వాత బదిలీల కారణంగా కొత్తవారు రావడం కబ్జారాయుళ్లకు కలిసొచ్చింది. పేదలకు ఇంటిపట్టాల పేరుతో.. కొండలను చదును చేసిన తీరును అధికారులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా... సుమారు 3 కిలో మీటర్ల పరిధిలోని వంకను.. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details