కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ప్రజారోగ్య సంరక్షణ నిమిత్తం అనంతపురంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో కొవిడ్ 19 ఆస్పత్రిగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలోని అన్ని బెడ్లు కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ , ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, హాస్పిటల్ ప్రిపేర్నెస్ స్పెషలాఫీసర్ లు ఇందుకు సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పూర్తిగా కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. దీంతో ఆసుపత్రి వర్గాలు అందుకు తగిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
పూర్తిస్థాయి కొవిడ్ 19 ఆస్పత్రిగా.. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి - పూర్తిస్థాయి కొవిడ్ 19 ఆస్పత్రిగా అనంతపురం జనరల్ ఆస్పత్రి
అనంతపురం జిల్లాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని పూర్తిస్థాయి కొవిడ్ 19 ఆస్పత్రిగా చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
government general hospitals