అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తగరకుంటలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తోపుదర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న పరందామయ్య అనే వ్యక్తి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. దీని కారణంగానే ఆయన తరచూ వింతగా ప్రవర్తించేవాడని స్థానికులు చెబుతున్నారు.
మానసిక సమస్యతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు బలవ్మరణం - ఈటీవీ భారత్ తాజా వార్తలు
మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ల సమక్షంలోనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు స్థానికులు.
నిన్న ఉదయం భార్య పిల్లలు మేడాపురం వెళ్లారు. వాళ్లు అటు వెళ్లగానే ఇంట్లోకి వెళ్లి పరందామయ్య తలుపులు వేసుకున్నాడు. ఆ తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం వరకు తలుపులు తెరవకపోయేసరికి అనుమానం వచ్చిన స్థానికులు కిటికీల నుంచి చూశారు. విగతజీవుడిగా ఆయన పడి ఉన్నాడు. వెంటేనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చిన తర్వాత తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:'ప్రజలకు చెట్టు కింద వైద్యం- వైకాపా నేతలకు కార్పొరేట్ వైద్యం'