ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు వేతనాలు పెంచాలని అనంతపురంలో ఆస్పత్రి ముందు వైద్యులు నిరసన తెలిపారు. వైద్య వృత్తిలో ఉండి మరణించిన వారికి భీమా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్న వారి పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.
కరోనా వంటి విపత్కర సమయంలోనూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.