ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రివర్స్ టెండరింగ్​తో రూ.700 కోట్లు ఆదా: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి - Government Chief Whip Srikanth Reddy examines the main canal works of Handriniva in Kadari constituency

కదిరి నియోజక వర్గంలో హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పరిశీలించారు. జనవరి నాటికి రాయలసీమ జిల్లాలలోని అన్ని చెరువులను కృష్ణా జలాలతో నింపుతామన్నారు.

the main canal works of Handriniva in Kadari constituency

By

Published : Sep 26, 2019, 5:50 PM IST

రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.700కోట్లు ఆదా..ప్రభుత్వ చీఫ్ విప్

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో 14, 15వ ప్యాకేజీల కింద జరుగుతున్న హంద్రీనీవా ప్రధాన కాలువ పనులను ఆయన పరిశీలించారు. కదిరి మండలం పట్నం వద్ద మద్దిలేటి వాగుపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులతో పాటు చెరువులకు నీటిని వదిలేందుకు అనువైన ప్రదేశాలను ఆయన పరిశీలించారు. తలుపుల మండలం సబ్బంగుంతపల్లి వద్ద ఆగిపోయిన సొరంగం పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. డిసెంబర్ 15 నాటికి ప్రధాన కాలువ పనులు పూర్తి చేసి జనవరిలో కృష్ణా జలాలను విడుదల చేస్తామన్నారు. జలయజ్ఞం పేరుతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి లెక్కకు మించిన ప్రాజెక్టులను మొదలుపెట్టి పూర్తి చేశారన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రెండు పనులలోనే ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలను ఆదా చేసిన విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు జీర్ణించుకోవడం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details