అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలాజీ ఆధ్వర్యంలో జరిగిన పూజలో ఈఓ రమేష్ బాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ అశోక్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పెన్నా అహోబిలంలో ఘనంగా గోపూజ కార్యక్రమం - Gopuja program in Pennahobilam newsupdates
పెన్నా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోపూజను రాష్ట్రవ్యాప్తంగా తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు.

పెన్నహోబిలంలో ఘనంగా గోపూజ
గోవులో 33 కోట్ల దేవతలుంటారని.. గోవును పూజిస్తే దేవతల కరుణా కటాక్షాలు లభిస్తాయని పేర్కొన్నారు. గోపూజను రాష్ట్రవ్యాప్తంగా తితిదే, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా 2,679 ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.