ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోస్ట్​మాస్టర్ చేతివాటం... ''కోటి'' మాయం..!?

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం తపాల ఉప కార్యాలయంలో ఓ పోస్ట్ మాస్టర్ చేతివాటం ప్రదర్శించారు. ఖాతాదారులకు తెలియకుండా... వారి ఖాతాల నుంచి కోటి వరకూ నగదు కాజేశాడు.

పోస్ట్​మాస్టర్ చేతివాటం

By

Published : Aug 1, 2019, 9:04 PM IST

పోస్ట్​మాస్టర్ చేతివాటం

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం తపాల ఉప కార్యాలయంలో ఖాతాదారులు పొదుపు చేసుకున్న సొమ్ము పక్కదారి పట్టింది. కార్యాలయంలోని ఓ ప్రధాన అధికారి ఏకంగా కోటి రూపాయలు స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం తాడిపత్రి పట్టణానికి చెందిన ఓ ఖాతాదారుడు... తాను పొదుపు చేసుకున్న రూ.1.60 లక్షలు డ్రా చేసుకునేందుకు వెళ్ళాడు. ఖాతా పుస్తకాన్ని పరిశీలించిన నూతన పోస్ట్ మాస్టారు ఖాతాలో రూ.80 వేలు మాత్రమే నిల్వఉన్నాయని... ఇది వరకే ఈ ఖాతా నుంచి రూ.80 వేలు డ్రా చేసినట్లుగా చెప్పారు. ఈ అనూహ్య పరిణామానికి.. సదరు ఖాతాదారుడు నివ్వెరపోయాడు.

తాను ఇప్పటి వరకు నగదు డ్రా చేయలేదంటూ... అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పోస్ట్ మాస్టారు ఉన్నతాధికారులకు అందించారు. వారు కార్యాలయానికి వచ్చి అన్ని ఖాతాలను తనికీ చేయగా... రికార్డుల్లో నిల్వలకు, ఖాతాలో నిల్వలకు భారీ వ్యత్యాసం ఉండటాన్ని గుర్తించారు. దాదాపు రూ.కోటి వరకు గోల్​మాల్ జరిగినట్లుగా నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఖాతాదారులు పెద్దఎత్తున కార్యాలయానికి వచ్చారు. తమ ఖాతాల్లోని నగదు తనిఖీ చేయించుకున్నారు. కొందరి ఖాతాల్లో లక్షలు, వేలు నగదు మాయం అయ్యిందంటూ ఆందోళన చేపట్టారు.

ఇటీవల తపాలా కార్యాలయంలో జరిగిన బదిలీల నేపథ్యంలో... గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన పోస్ట్ మాస్టారు అవినీతికి పాల్పడినట్లుగా ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. తాడిపత్రి నుంచి బదిలీపై అనంతపురం కార్యాలయానికి వెళ్లిన ఆయన... ఇంత వరకు విధుల్లో చేరకుండా పరారీలో ఉన్నట్లుగా సమాచారం. ఖాతాల పూర్తి దర్యాప్తు చేసే వరకు ఎంత నగదు మాయం అయ్యిందనే విషయం చెప్పలేమని తపాలా శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ...

విద్యుత్‌ కంపెనీల పిటిషన్లపై ఈనెల 22న విచారణ

ABOUT THE AUTHOR

...view details