ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లోకి చొరబడి.. వృద్దురాలి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దొంగ

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి.. ఓ దొంగ గొలుసు లాక్కెళ్లిన ఘటన కదిరి పట్టణంలో జరిగింది. స్థానికుల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ
వృద్దురాలు మెడలోంచి బంగారు గొలుసును లాకెళ్లిన దొంగ

By

Published : Nov 11, 2020, 8:17 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో దొంగతనం జరిగింది. పద్మావతి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఓ దొంగ ఇంట్లోకి చొరబడ్డాడు. వృద్దురాలు అరవకుండా చేయి అడ్డుపెట్టి ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. స్థానికుల సహాయంతో ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details