అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో నివాసముంటున్న ఉమర్ ఫరూక్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంటి తలుపులు పగలగొట్టి రూ. లక్షా 20 వేలు నగదు, రెండు తులాల బంగారం, 200 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. ఉమర్ ఫరూక్.. తన భార్య ఆనారోగ్యానికి గురికావడంతో మంగళవారం ఆస్పత్రికి తీసుకెళ్లాడు. రాత్రి అక్కడే ఉండి తెల్లవారుజామున ఇంటికొచ్చిన ఫరూక్.. ఇంటి తలుపులు, బీరువా పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. చోరీపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
theft case: రూ. లక్షా 20 వేలు, బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు - theft case
అనంతపురం జిల్లాలో రోజు రోజుకు దొంగలు పేట్రేగిపోతున్నారు. హిందూపురంలోని ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. రూ. లక్షా 20 వేల నగదు, పలు బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.
హిందూపురంలోని ఆర్టీసీ కాలనీలో చోరీ