అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామిడూరు గ్రామ శివారులో సాయంత్రం పిడుగుపాటుకు 18 మేకలు మృత్యువాత పడ్డాయి. మామిడూరు గ్రామానికి చెందిన గంగాధర.. తనకున్న గొర్రెలన్నింటిని మేత కోసం గ్రామ సచివాలయం పంట పొలాల్లోకి తోలుకు వెళ్లాడు. ఉరుములు మెరుపులు మొదలు కావడంతో ఓ చెట్టు కిందికి వాటిని నిలిపి.. తాను మరో చెట్టు కింద తలదాచుకున్నాడు.
ఒక్కసారిగా పిడుగుపడడంతో.. మేకలన్నీ అక్కడికక్కడే మృతి చెందినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు... పిడుగుపాటుకు మేకలు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాపరి గంగాధరకు న్యాయం చేయాలని అధికారులను గ్రామస్థులు కోరారు.