75వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్ జేసీ. ప్రభాకర్ రెడ్డి.. పెన్నానది ఒడ్డున ఉన్న జాయ్ పార్క్లో 'గో' గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూమిపై మానవుడు మనుగడ సాధించాలంటే చెట్లతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
కరోనా సమయంలో ఆక్సిజన్ లేక అనేక మంది మృత్యువాత పడ్డారని, వారిని కాపాడేందుకు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేని పరిస్థితి నెలకొన్న విషయాన్ని జేసీ గుర్తు చేశారు. గోగ్రీన్ యాప్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లామని అందులో 1500 మంది సభ్యులుగా చేరారన్నారు. ప్రతి ఇంట మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు.
తన తండ్రి జేసీ నాగిరెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాటాలు చేశారని... ఏడు దశాబ్దాలుగా తాడిపత్రి ప్రజలు రాజకీయాల్లో తమ కుటుంబాన్ని ఆదరిస్తున్నారని తెలిపారు. తాడిపత్రిని అభివృద్ధి చేయడం తన బాధ్యతగా తీసుకున్న అని చెప్పారు.