ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్ అధికారుల నిర్వాకం..ఒకరికి బదులు మరొకరికి నగదు - andhra bank dipuet at anantapuram district news

బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక మహిళ ఖాతాలోని డబ్బులను మరో మహిళకు ఇవ్వడం ఘర్షణకు దారి తీసింది. దీంతో బాధితురాలి బంధువులు, బ్యాంక్​లో పనిచేసే సిబ్బంది పరస్పరం దాడి చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటాంపల్లి గ్రామంలోని ఆంధ్రాబ్యాంకులో చోటు చేసుకుంది.

conflict to andhra bank employ and victims
ఘర్షణకు దిగిన బ్యాంక్ అధికారి, వినియోగదారులు

By

Published : Sep 29, 2020, 2:07 PM IST

ఘర్షణకు దిగిన బ్యాంక్ అధికారి, వినియోగదారులు
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మహిళా ఖాతాలో డబ్బులను ఆదే గ్రామానికి చెందిన మరో మహిళకు ఇచ్చారు. వారం రోజుల క్రితం బ్యాంక్ అధికారులు రూ.30 వేల నగదును అదే గ్రామానికి చెందిన పుల్లమ్మ అనే మరో మహిళకు పొరపాటుగా ఇచ్చారు. దీంతో తమ ఖాతాలో నగదు పోయిందంటూ పుల్లమ్మ బంధువులు బ్యాంక్ అధికారులను సంప్రదించగా.. పొరపాటు జరిగిందని చెప్పి రూ.10 వేలు వెనుకకు ఇచ్చారు. మరో వారం రోజుల తరువాత మిగిలిన రూ.20 వేలు ఇస్తామని చెప్పి పంపించారు.

వారం గడిచిన తరువాత రూ.20 వేలు ఇవ్వాలని బ్యాంక్ వద్దకు బాధితులు వచ్చి.. ఫీల్డ్ అధికారి గంగాధర్ రెడ్డిని సంప్రదించారు. అయితే ఆ గ్రామానికి చెందిన పుల్లమ్మ ఇంకా నగదు తమకు ఇవ్వలేదని.. ఆమె ఇచ్చిన తరువాత ఇస్తామని, లేదంటే మీరే వెళ్లి ఆమె దగ్గర నుంచి నగదు తీసుకోవాలని సమాధానం చెప్పడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. తమకు.. ఆమెతో ఎలాంటి సంబంధం లేదని.. మీరే నగదు ఇవ్వాలని గంగాధర్ రెడ్డితో బాధితులు వాగ్వాదానికి దిగారు. అది కాస్తా ముదిరి బ్యాంకులోనే పరస్పరం చెప్పులతో దాడులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంక్ వద్దకు చేరుకొని ఇరువురికి నచ్చజెప్పడం గొడవ సద్దుమణిగింది.

ABOUT THE AUTHOR

...view details