అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ప్రభుత్వ కోవిడ్ నిబంధనలను విస్మరించి.. కొత్త సంవత్సరం రోజున ప్రిన్సిపాల్ నాగరాజు బయటి వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించి వేడుకలు నిర్వహించాడు. అంతటితో ఆగకుండా బాలికల ముందే అసభ్యకరంగా నృత్యాలు చేశారు.
నాగిని డ్యాన్స్ చేసిన ప్రిన్సిపల్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
అనంతపురం జిల్లాలోని గురుకుల పాఠశాలలో ప్రభుత్వ కొవిడ్ నిబంధనలను పాటించకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించిన ప్రిన్సిపాల్ సస్పెండ్‌కు గురయ్యాడు. బయటి వ్యక్తులను బాలికల గురుకుల పాఠశాలలోకి తీసుకొచ్చి వేడుకలు నిర్వహించాడు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో అధికారులు అతనిపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.
సస్పెండైన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్
ఈ సన్నివేశాన్ని అక్కడే ఉన్నవారు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. నెట్టింట్లో ఈ వేడుకల వీడియోలు వైరల్‌గా మారాయి. ఉన్నతాధికారులు ఆ వీడియోను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమం నిర్వహించారని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. మరో ఇద్దరు టీచర్లకు సైతం మెమోలు జారీ చేశారు.
ఇదీ చదవండి:యూకే స్ట్రెయిన్ కట్టడికి ప్రభుత్వం చర్యలు...
Last Updated : Jan 8, 2021, 1:28 PM IST