అనంతపురంలో ప్రసాద్, సుశీల దంపతులు రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరి కుమార్తె ప్రశాంతికి అనారోగ్యంగా ఉండటంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స చేస్తుండగా పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది.
'బిల్లు కోసం చనిపోయిన విషయం చెప్పలేదు' - అనంతపురం నేర వార్తలు
అనంతపురంలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఓ బాలిక తల్లిదండ్రుల నుంచి డబ్బు వసూలు చేసిన అనంతరం... బాధితురాలు చనిపోయిందంటూ వైద్యులు చెప్పారు. ఈ ఘటనలో దిగ్భ్రాంతికి గురైన మృతురాలి తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
అనారోగ్యంతో మృతి చెందిన బాలిక
ఈ విషయాన్ని ప్రసాద్, సుశీల దంపతులకు చెప్పకుండా వైద్యులు బిల్లు కట్టించుకున్నారు. బిల్లు చెల్లించిన అనంతరం బాలిక చనిపోయిందని చెప్పారు. తీవ్ర ఆవేదనకు గురైన బాలిక తల్లిదండ్రులు.. బిల్లు చెల్లించే వరకు తమ కూతురు చనిపోయిన విషయం చెప్పలేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఆస్పత్రిపై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.