ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాయకట్టులో డెంగీ జ్వరంతో చిన్నారి మృతి.. - girl dead with dengi fever at payakattu latest news

సీజనల్ వ్యాధులు చిన్నారుల ప్రాణాలను హరిస్తున్నాయి. గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో ఓ చిన్నారి మృతిచెందింది. అపరిశుభ్ర వాతవరణం వల్లే బాలిక మృతి చెందిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

dengi fever news in payakattu

By

Published : Oct 21, 2019, 7:33 PM IST

పాయకట్టులో డెంగీ జ్వరంతో చిన్నారి మృతి..

గ్రామీణ ప్రాంతాల్లో అపరిశుభ్రతతో రోజూరోజుకి రోగాలు విజృంభిస్తున్నాయి.అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం పాయకట్టులో డెంగీ జ్వరంతో రెండో తరగతి విద్యార్థిని వర్షిత మృతి చెందింది.వారం రోజుల కిందట చిన్నారికి జ్వరం సోకడంతో కదిరిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు.మళ్లీ జ్వరం రావడంతో ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.అప్పటికే పరిస్థితి విషమించి బాలిక మృతి చెందింది.పాయకట్టులో అపరిశుభ్రత వల్ల దోమలు విపరీతంగా పెరిగి పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details