కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. బళ్లారికి చెందిన పర్వీన్‌కు వచ్చే నెల మొదటి వారంలో వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనుల్లో బిజీ అవుతానని చెప్పి.. అమ్మమ్మను పలకరించేందుకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి గ్రామానికి వచ్చింది. పెద్దమ్మ కుమారునితో కలసి తిరిగి బళ్లారికి ద్విచక్రవాహనంపై పయనమైంది. అయితే ఇంటి నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే వీరి ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పర్విన్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడ్డ ఆమె సోదరుడిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల్లో పెళ్లి కూతురు కావాల్సిన యువతి ఇలా చనిపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వచ్చె నెలలో పెళ్లి.. అంతలోనే ప్రమాదంలో మృతి - road accident at anantapuram district news
వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. అనంతపురం జిల్లాలో లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈఘటనలో పర్వీన్ అనే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు.
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి