ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా భక్తులు గాయత్రి హోమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో వేద పండితులు శ్రీరామ్ ఆధ్వర్యంలో గాయత్రి హోమం నిర్వహించారు. గణపతి పూజ, కలశపూజ, సహస్ర అర్చన ఇతర పూజా కార్యక్రమాలను నిర్వహించి గాయత్రి మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని క్రతువు జరిపారు. వేలాది మంది భక్తుల సాయి గాయత్రి నామ స్మరణతో ప్రశాంతి నిలయం పులకించిపోయింది. వేలాది మంది భక్తులు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ గాయత్రి హోమం - prakasam devotees
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా భక్తులు గాయత్రి హోమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ప్రకాశం జిల్లా భక్తులు భక్తి శ్రద్ధలతో గాయత్రి హోమం నిర్వహించారు.
గాయత్రి హోమం