అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగిన చంద్రమౌళీశ్వరుడి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వసంతోత్సవం కార్యక్రమంతో ముగిశాయి. ముందుగా ఉత్తరధికారి కరి బసవ రాజేంద్రస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపి చంద్రమౌళీశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న బసవన్న గుడి వరకు పల్లకిలో ఊరేగించారు. అనంతరం గవిమఠం ఆవరణలో ఉన్న బావి వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. మొదటి రోజు కంకణ మండపంలో కుండల్లో వేసిన నవధాన్యాల మొలకలను బావిలో కలిపారు.
ముగిసిన గవిమఠం బ్రహ్మోత్సవాలు - గవిమఠం బ్రహ్మోత్సవాలు తాజా
ప్రసిద్ధ శైవ క్షేత్రమైన గవిమఠం బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. చంద్రమౌళీశ్వరుడి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు.
గవిమఠం బ్రహ్మోత్సవాలు తాజా,ఉరవకొండ తాజా వార్తలు