Gas Price Hike: ఇప్పటికే పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండగా... వాటికితోడు వంటగ్యాస్ ధరలు పెరిగాయి. దీంతో సామాన్యులపై మరింత భారం పడింది. రష్యా నుంచి చమురు దిగుమతి పేరిట ఇప్పుడు చమురు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతోంది. ఎల్‌పీజీ వంటగ్యాస్ సిలిండరుపై 50 రూపాయలు భారం పడింది.
Gas Price Hike: గ్యాస్ 'ధరల మంట'... ఏయే జిల్లాలో ఎంతంటే..! - Gas Price Hike in AP
Gas Price Hike: పెరిగిన గ్యాస్ ధరలపై..ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క డీజిల్, పెట్రోలు ధరలు పెరిగాయి...మరో పక్క వంటనూనెలు, నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇలా నెలనెలా గ్యాస్ ధరలు పెంచుతూపోతే.. ఎలా జీవనం కొనసాగించాలని సామాన్య ప్రజలు వాపోతున్నారు.
రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాలో 14.2 కేజీల వంటగ్యాస్ సిలిండరు ధర వెయ్యి రూపాయలు దాటింది. మరికొన్ని జిల్లాల్లో వెయ్యి రూపాయలకు అతి చేరువగానే గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయి. విశాఖ రిఫైనరీ నుంచి రాష్ట్రంలో మిగతా ప్రాంతాలకు వంటగ్యాస్ సరఫరా అవుతున్నందున ఆ మేరకు రవాణా ఖర్చులతో కలిసి రిటైల్ ధరలు నిర్ణయం అవుతున్నాయి. ప్రాంతాన్ని వారీగా ధరలో స్వల్ప వ్యత్యాసాలు కూడా ఉంటాయి.
ఇదీ చదవండి :Lock to Village Secretariat: బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం..!
TAGGED:
Gas Price Hike in AP