అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరువుచింతలపల్లిలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న వృద్ధురాలు బండి లక్ష్మీదేవమ్మ తీవ్రంగా గాయపడింది. లక్ష్మీదేవమ్మ వంట గదిలో విద్యుత్ బల్బుని వెలగించగా.. అప్పటికే గ్యాస్ లీక్ అయ్యి ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు గ్యాస్ సిలండర్ వరకు వ్యాపించి... గ్యాస్ సిలండర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కుప్పకూలింది. భారీ శబ్దం రావటంతో... భయాందోళనతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైన లక్ష్మీదేవమ్మను 108లో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పేలిన గ్యాస్ సిలిండర్.. వృద్ధురాలికి తీవ్ర గాయాలు - గ్యాస్ సిలండ్ పేలుడు
ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గరువుచింతలపల్లిలో జరిగింది.
పేలిన గ్యాస్ సిలండర్