ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డస్ట్ బిన్లు అందుబాటులో లేక... పీపీఈ కిట్లలో చెత్త తరలింపు - Garbage evacuation with PPE kits news

చెత్తబుట్టలు అందుబాటులో లేకపోవటంతో.. వైద్య సిబ్బంది ఉపయోగించిన పీపీఈ కిట్లను చెత్త తరలించటానికి ఉపయోగిస్తున్నారు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రి వద్ద ఉన్న ఈ పరిస్థితిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ppe kits
పీపీఈ కిట్లతో చెత్తను తరలిస్తున్న వైనం

By

Published : May 22, 2021, 1:40 PM IST

అనంతపురం జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో చెత్తబుట్టలు లేని కారణంగా.. వైద్య సిబ్బంది వాడిన పీపీఈ కిట్లతోనే మున్సిపాలిటీ సిబ్బంది చెత్తను తరలిస్తున్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు కనీస వసతులు సమకూర్చే పరిస్థితిలో లేరని ప్రజలు ఆరోపిస్తున్నారు.

మున్సిపల్​ సిబ్బందికి భద్రత దృష్ట్యా పీపీఈ కిట్లు అందించక పోగా… వాడి పడేసిన వాటిలో చెత్త తీసుకెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన చెందారు. కొవిడ్​ వ్యాప్తితో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే… మున్సిపల్​ సిబ్బంది పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details