అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ ఎర్టీగా కారు పోలీసులను చూసి ఆగకుండా వెళ్లగా వెంబడించి పట్టుకొని సోదాలు చేశారు. 24 కేజీల గంజాయి, 2 కేజీల గంజాయి నూనెను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఆరెస్ట్ చేశారు. వీటి విలువ సమారు రూ.7.60 లక్షలు ఉంటుందని తాడిపత్రి డీఎస్పీ కె.చైతన్య తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీఎస్పీ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లింగంపల్లికి చెందిన ముత్యాల శేషుకుమార్, అతని భార్య ముత్యాల శ్యామల, కొవ్వూరుకు చెందిన పల్లి వెంకట రవితేజ, నెల్లూరుకు చెందిన ఒట్టికల మాధవరావులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. విశాఖ మన్యంలోంచి గంజాయిని కొనుగోలు చేసి కారులో కుటుంబ సభ్యుల మాదిరిగా రాజమండ్రి, బెంగుళూరు, మదురై తరితర ప్రాంతాలకు తిరుగుతూ విక్రయించేవారు. నిందితులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు.