విజయవాడ టూ తాడిపత్రి-గంజాయి ముఠా గుట్టురట్టు
విజయవాడ నుంచి తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్న వ్యక్తులను తాడిపత్రి పోలీసులు అరెస్టు చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో గంజాయి విక్రయ కేంద్రంపై పోలీసులు దాడి చేసి ఖాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 700 గ్రాముల గంజాయి, రూ.27వేల 450 నగదు స్వాధీనం చేసుకున్నారు. గాంధీ కట్ట సమీపంలో గంజాయి విక్రయాలపై పక్కా సమాచారంతోనే దాడి చేశామని చెప్పారు. ముగ్గురు పరారయ్యారని... ఖాజా అనే వ్యక్తి చిక్కినట్టు పేర్కొన్నారు. విజయవాడ నుంచి గంజాయి దిగుమతి చేసుకుని తాడిపత్రిలో విక్రయాలు చేస్తున్నారు. గతంలో వీరిపై 3గంజాయి కేసులు, 4మట్కా కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.