Ganja Gang Arrested in Anantapur District: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం, బాపట్ల జిల్లాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని సరఫరా చేస్తున్న 18 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఏజన్సీ నుంచి తక్కువ ధరకు గంజాయి తెప్పించి, చిన్న చిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనల్లో పట్టుబడిన గంజాయి విలువ, స్వాధీనం చేసుకున్న వస్తువులు, నిందితుల వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ వెల్లడించారు.
SP Anburajan Comments: ఎస్పీ అన్బురాజన్ తెలిపిన వివరాల ప్రకారం.. ''గతకొన్ని నెలలుగా విశాఖ ఏజన్సీ నుంచి తక్కువ ధరకు గంజాయిని తెప్పించి.. అనంతపురంలో విక్రయిస్తున్న రెండు ముఠాలను నేడు అదుపులోకి తీసుకున్నాము. ఈ కేసులో మొత్తం 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. దాదాపు 18 నిందితులను అదుపులోకి తీసుకున్నాము. గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలో.. జాఫర్, షబ్బీర్, నజీర్‌లు ఉన్నారు. వీరు చింతపల్లి నుంచి కిలో నాలుగు వేల చొప్పున గంజాయి కొనుగోలు చేసి, అనంతపురంలో పదిహేను వేల రూపాయలతో విక్రయిస్తున్నారు.మరికొంతమంది నిందితులు నవీన్, సత్యనారాయణ, లోకేష్, జావెద్, నక్కా నవీన్, షేక్సావలీలు తక్కువ ధరకు కొనుగోలు చేసి.. దాన్ని చిన్న పొట్లాలుగా మార్చి, విక్రయిస్తున్నారు. నిందితుల నుంచి 18 సెల్‌ఫోన్లు, రెండు ఆటోలు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాం.'' అని ఆయన ఘటన వివరాలను వెల్లడించారు.
Tirupathi Police Seized 10 Kgs Ganja : 10 కేజీల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
101 People Arrested in Ganja Incidents: అనంతరం ఈ గంజాయి ముఠా నుంచి చిన్న ప్యాకెట్లను కొనుగోలు చేసిన వారు ఇప్పటివరకూ 101 మంది ఉన్నారని, వారిలో కొంతమంది మైనర్లు కూడా ఉన్నారని.. ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. గంజాయి సరఫరా చేస్తూ.. పోలీసులకు పట్టుబడిన అందర్నీ కౌన్సిలింగ్ పంపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కోరనున్నట్లు ఆయన తెలిపారు.