అనంతపురం జిల్లా హిందూపురంలో రెండవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం రాత్రి రహమత్పురంలో జరిగిన ఈ ఘర్షణలో కత్తులతో ఇరువర్గాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరిని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మారూన్ అనే 26 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి ఘర్షణకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి - హిందూపురంలో గ్యాంగ్ వార్
విజయవాడ గ్యాంగ్ వార్ ఘటన మరవకముందే... అనంతపురం జిల్లా హిందూపురంలో అలాంటి సంఘటన మరొకటి జరిగింది. నిన్న రాత్రి రెండు వర్గాలు మధ్య జరిగిన ఘర్షణలో కత్తులతో దాడిచేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
![రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి hindupuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7553533-570-7553533-1591772053463.jpg)
hindupuram