చేతికొచ్చే పంట గాలివాన బీభత్సంతో నేలకొరిగి అన్నదాతకు ఆవేదన మిగిల్చాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంలో సంభవించిన గాలివాన నిండా ముంచేసింది. బొప్పాయి, దానిమ్మ తోటలు పదుల ఎకరాల్లో నేలకొరిగాయి. అపారనష్టం చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పెట్టుబడి అంతా మట్టిపాలైందని విలపిస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం - hampapuram
గాలివాన బీభత్సంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట చేతికి వస్తుందని ఆశపడుతున్న సమయంలో గాలివానతో పండ్ల తోటలకు అపార నష్టం వాటిల్లింది. పదుల ఎకరాల్లో బొప్పాయి, దానిమ్మ చెట్లు నేలకొరిగాయి.
గాలివాన బీభత్సం.. పండ్ల తోటలకు అపార నష్టం