అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం వద్ద జమ్మి వృక్షం కూలి మూడు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. తీగలు తెగి పోయి పట్టణంలో సరఫరా నిలిచిపోయింది. వైయస్సార్ కాలనీలో చెట్టు విరిగి పడి కారుపై పడింది. ఇంటి బయట పార్కింగ్ చేసిన కారుపై చెట్టు విరిగి పడి ఇంజిన్ పూర్తిగా దెబ్బతింది. ఈదురు గాలుల ధాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు దెబ్బతిన్నాయి.
ధర్మవరంలో గాలి బీభత్సం- నిలిచిని విద్యుత్ సరఫరా - dharmavaram lo varsham
అనంతపురం జిల్లా ధర్మవరంలో గురువారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.గాలివాన ధాటికి చెట్లు,విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి.
gali-vana-damage