ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gajanan Mallya: చిత్తాపూర్‌-రాయచూర్‌ సెక్షన్‌లో గజానన్ మాల్య తనిఖీలు

చిత్తాపూర్‌-రాయచూర్‌ సెక్షన్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య మంగళవారం తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌ వద్ద పరిసరాలను, సర్క్యులేటింగ్‌ ఏరియాను పరిశీలించి, స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను సమీక్షించారు.

Gajanan Malya
చిత్తాపూర్‌-రాయచూర్‌ సెక్షన్‌లో గజానన్ మాల్య తనిఖీలు

By

Published : Sep 21, 2021, 7:54 PM IST

చిత్తాపూర్‌-రాయచూర్‌ సెక్షన్‌లో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య మంగళవారం తనిఖీలు చేపట్టారు. స్టేషన్‌ వద్ద పరిసరాలను, సర్క్యులేటింగ్‌ ఏరియాను పరిశీలించి, స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను జీఎం సమీక్షించారు. యాదగిరి రైల్వే స్టేషన్‌ నుంచి జీఎం గజానన్‌ మాల్య తనిఖీలు ప్రారంభించారు. స్టేషన్‌ వద్ద పరిసరాలను, సర్క్యులేటింగ్‌ ఏరియాను పరిశీలించి, స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న వసతులను ఆయన సమీక్షించారు. అధికారులతో వివిధ అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. గూడ్స్‌ షెడ్‌ను తనిఖీ చేయడంతో పాటు, సరుకు రవాణా వినియోగదారులతో సమావేశమై..సరుకు రవాణాలో మరింత అభివృద్ధి, రవాణా సులభతరంపై చర్చించారు. ప్రతిపాదిత 2వ గూడ్స్‌ లైన్‌ను తనిఖీ చేసి, సరుకు రవాణా లోడిరగ్‌, అన్‌లోడిరగ్‌లో అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.

యాదగిర్‌-రాయచూర్‌ సెక్షన్‌ మధ్య లింగేరి స్టేషన్‌లో స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయాన్ని, స్టేషన్‌ పరిసరాలను తనిఖీ చేశారు. ప్రతిపాదిత ప్రత్యామ్నాయ గూడ్స్‌ షెడ్‌ను పరిశీలించారు. భద్రతా అంశంలో భాగంగా ట్రైన్‌ తనిఖీ పాయింట్‌ను జీఎం గజానన్ మాల్య తనిఖీ చేశారు. రాయచూర్‌ స్టేషన్‌లో తనిఖీలతో పాటు.. ప్లాట్‌ఫారాలు, పాదచారుల వంతెన పరిశీలించి, అక్కడ సిబ్బందితో వారి సంక్షేమంపై మాట్లాడారు. గూడ్స్‌ షెడ్‌ను తనిఖీ చేశారు. గూడ్స్‌ లోడింగ్‌ మెరుగుదలకు సంబంధించి వ్యాపారస్తులతో, వినియోగదారులతో సరుకు రావాణా అభివృద్ధికి సంబంధించి వారితో మాట్లాడారు.

గుంతకల్‌ డివిజన్‌ డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ వెంకటరమణా రెడ్డి, ఇతర సీనియర్‌ అధికారులు కూడా ఆయనతో పాటు తనిఖీలలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి : SUICIDE ATTEMPT: పోలీస్​స్టేషన్​లో యువతి ఆత్మహత్యాయత్నం.. ఎందుకంటే..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details